Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏడుకు పెరిగిన 'రాజీవ్ గృహకల్ప' మృతుల సంఖ్య

రెండ్రోజుల క్రితం వికారాబాద్ లోని రాజీవ్ గృహకల్ప వద్ద అనుమానాస్పద స్థితిలో పేలుడు సంభవించిన ఘటనలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఈ పేలుడులో గాయపడిన ఏసు అనే వ్యక్తి ఉస్మానియాలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. కాగా, ఈ సంఘటనపై తొలుత పలు అనుమానాలు రేకెత్తినా, గ్యాస్ సిలిండర్ వల్లనే పేలుడు సంభవించినట్టు నిపుణుల బృందం తేల్చింది.

ఈమేరకు ఎస్పీ రాజకుమారి తాజా వివరాలు వెల్లడించారు. పేలుడు కారణంగా నలుగురు అదే రోజు చనిపోయిన సంగతి తెలిసిందే. మరికొందరికి గాయాలవడంతో వారికి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

More Telugu News